Worship

సర్వ శరీరుల దేవుడా

Sarva Shareerula Devudaa

Watch on YouTube
సర్వ శరీరుల దేవుడా నీకసాధ్యమే లేదయ్యా (2) చాచిన నీ బాహువుతో భూమి ఆకాశాలు చేసితివే నిన్న నేడు నిరంతరం - ఏకరీతిగుంటివే లేనే లేదయ్యా హో యేసయ్యా నీకసాధ్యమైనదేది లేదయ్యా లేనే లేదయ్యా మా యేసయ్యా నీకసాధ్యమైనదేది లేదయ్యా (2) ||సర్వ శరీరుల|| ఆదాము హవ్వలను చేసినట్టి దేవా సృష్టికర్త నీకే స్తోత్రము హేబెలు అర్పణను అంగీకరించిన గొర్రెపిల్ల దేవా స్తోత్రము హానోకును నీతో కూడా నడిపినావు నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు సర్వశక్తుడా - నీతిమంతుడా మార్పు లేని మా దేవుడా ||లేనే లేదయ్యా|| అబ్రహాముతో నిబంధనను చేసినావు అబ్రహాము దేవా స్తోత్రము ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు ఇస్సాకు దేవా స్తోత్రము యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు యోసేపును పెద్ద రాజుగా చేసినావు శ్రీమంతుడా - యాకోబు దేవుడా చూచుచున్న మా దేవుడా ||లేనే లేదయ్యా|| మోషేతో పొద నుండి మాటలాడినావుగా ఉన్నవాడా నీకే స్తోత్రము ఎర్ర సంద్రమున్ రెండు పాయలుగా చీల్చినావు భీకరుండా నీకే స్తోత్రము యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు మేఘ స్థంభమా - అగ్ని స్థంభమా చీల్చబడిన బండ దైవమా ||లేనే లేదయ్యా|| గిద్యోను సైన్యముకు జయమునిచ్చినావుగా విజయశీలుడా స్తోత్రము సమ్సోనుకు సింహ బలమునిచ్చినావుగా యూదా సింహమా స్తోత్రము బోయజుతో రూతును విమోచించినావు సమూయేలును మందసం నుండి పిలిచినావు పరిశుద్ధుడా - విమోచకుడా ఎబినేజరు స్తోత్రము ||లేనే లేదయ్యా|| దావీదు నా హృదయానుసారుడంటివే రాజాధి రాజా స్తోత్రము సొలొమోనుకు ఆత్మ జ్ఞానమెంతో ఇచ్చినావు అనంత జ్ఞాని స్తోత్రము ఏలీయాకై అగ్ని పంపి నీవు గెలచినావు ఎలీషాకు రెండంతలాత్మనిచ్చినావు ఆత్మ రూపుడా - రోషవంతుడా జీవము గల దేవుడా ||లేనే లేదయ్యా|| నెహెమ్యాతో పడిన గోడలు కట్టించినావు యెరూషలేము దేవా స్తోత్రము జెరుబ్బాబెలునడ్డగించు కొండ నణిపినావు మందసపు దేవా స్తోత్రము ఎస్తేరుచే రాజు ఆజ్ఞనే మార్చినావు దానియేలును సింహాల నుండి బ్రోచినావు షద్రక్ మేషాకూ - అబేద్నెగోల దేవుడా నిత్య రాజ్య స్థాపకుడా ||లేనే లేదయ్యా|| యెహోషాపాతుకై పోరు సలిపినావు యుద్ధ శూరుడా స్తోత్రము యబ్బేజు సరిహద్దులిస్తరించినావుుగా యజమానుడా స్తోత్రము హిజ్కియాకు ఆయుష్షు నీవు పెంచినావు యెషయాకు దర్శనమును చూపినావు మహిమ రూపుడా - నిత్య జీవుడా సింహాసనాసీనుడా ||లేనే లేదయ్యా|| యోబుకు రెట్టింపు దీవెనిచ్చినావుగా నమ్మదగిన దేవా స్తోత్రము యోనాను చేప కడుపు నుండి లేపినావుగా దీర్ఘశాంతుడా స్తోత్రము యెహేజ్కెలుపై నీ ఆత్మ హస్తముంచినావు యోహానును త్రోవ సరళ పరచ పంపినావు ప్రవచనాత్ముడా - మనుష్య కుమారుడా ప్రవక్తలందరికి దేవుడా ||లేనే లేదయ్యా|| కృపా సత్యములు మాకై తెచ్చినావుగా యేసు దేవా నీకే స్తోత్రము తండ్రి చిత్తము అంత నెరవేర్చినావుగా దేవ తనయుడా స్తోత్రము రక్తధారతో మా పాపమంతా కడిగినావు మృత్యుంజయుడవై సమాధి గుండె చీల్చినావు పునరుత్థానుడా - అభిషిక్తుడా పాపుల రక్షకుడా ||లేనే లేదయ్యా|| పేతురును బండలా స్థిరము చేసినావుగా పరిశుద్ధాత్ముడా స్తోత్రము సౌలును అపొస్తలునిగా మార్చినావుగా ఆశ్చర్యకరుడా స్తోత్రము యోహానుకు నీ రాజ్య మహిమ చూపినావు సంఘానికి ఇప్పుడు తోడుగా ఉండినావు పెండ్లి కుమారుడా - ప్రేమ రూపుడా రానున్న మా దేవుడా ||లేనే లేదయ్యా||