Praise

సర్వ లోకమా స్తుతి గీతం పాడెదం

Sarva Lokamaa Sthuthi Geetham Paadedam

Watch on YouTube
సర్వ లోకమా స్తుతి గీతం పాడెదం ప్రభుని నామమును ప్రబల పరచెదం (2) ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు స్తుతి మహిమలు సదా అర్పించెదం అతి సుందరుడు మహిమైశ్వరుడు ఆయన నామమును కీర్తించెదం ఎల్లప్పుడు ||సర్వ|| అన్ని కాలములలో ఉన్నాడు ఉంటాడు అన్ని స్థితి గతులలో నడిపిస్తాడు (2) సంతోషించుమా ఆనందించుమా ఆయన చేసినవి మరువకుమా సన్నుతించుమా మహిమ పరచుమా ఆయన నామమును ఘనపరచు ఎల్లప్పుడు ||సర్వ|| శోధన వేదన ఏది ఎదురైనా మొరపెడితే చాలునే విడిపిస్తాడే (2) రక్షకుడేసు రక్షిస్తాడు ఆయన నామములో జయం మనదే ఇమ్మానుయేలు మనలో ఉండగా జీవితమంతా ధన్యమే ధన్యమే ||సర్వ||