Christmas

సందడి - 4

Sandhadi - 4

Watch on YouTube
సందడి మొదలాయే మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయే మన రారాజు పుట్టాడని (2) బెత్లహేములో బలవంతుడు పుట్టినాడని సందడి పశులశాలలో పరిశుద్ధుడు పుట్టినాడాని సందడి మినుక్కు మంటు తళుక్కుమంటు చుక్కలు చేసే సందడి హోసన్న అంటు పాటలు పాడి దూతలు చేసే సందడి ||సందడి మొదలాయే|| కన్య మరియ గర్భమందు పుట్టినాడమ్మ రక్షకుడు పుట్టినాడామ్మ - యేసయ్య పుట్టినాడమ్మా అర్ధరాత్రి వేళలోన పుట్టినాడమ్మ రారాజు పుట్టినాడమ్మ - మహారాజు పుట్టినాడమ్మ (2) నీకోసం నాకోసం పుట్టినాడమ్మ పుట్టుడే మహా రాజుగా పుట్టినాడమ్మ మార్గం సత్యం జీవం యేసయ్యే ||సందడి మొదలాయే|| తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చినారమ్మ తారను చూచినారమ్మ - తార దారి చూపినారమ్మ బంగారు సాంబ్రాణి బోళము తెచ్చి ఇచ్చినారమ్మ జ్ఞానులర్పించినారమ్మ - యేసుకర్పించినారమ్మ (2) దూతవచ్చి శుభవార్త తెలిపినదమ్మ గొల్లలు గంతులు వేసి గానము చేసినారమ్మ సాగిలపడి పూజించారమ్మ ||సందడి మొదలాయే|| కన్నీరు తుడిచి కంటిపాపల కాచేవాడమ్మా కరుణామయుడమ్మ దయగలవాడమ్మ కష్టాలలోన నష్టాలలోన తోడుండేవాడమ్మ ఇమ్మానుయేలమ్మ తోడుంటాడమ్మ (2) వరమును విడిచి పరమాత్ముడే పవళించాడమ్మ మానవాళికై మహిమను విడిచి భువికొచ్చాడమ్మ మన పాపశాపములు తొలగించును అమ్మా ||సందడి మొదలాయే||