సమస్తానికి - ఆధారమైన యేసయ్య
కృపతో నన్ను - జ్ఞాపకం చేసుకోవయ్యా
ఏ దారిలో వెళ్లాలో తెలియక - ఆగిపోయానయ్యా
మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య
ఆత్మలో క్రుంగి అలసిన నాకు నీవే ఆధారము
నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము (2)
మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య
గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా
నీయందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను (2)
మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య
గాఢాంధకారం కమ్మినవేళ నీవే నా దీపము
కన్నీటి కెరటాలు నను ముంచువేళ నీవే నా నిరీక్షణ (2)
మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య
