Faith

సాగిపోదును - ఆగిపోను నేను

Saagipodunu - Aagiponu Nenu

Watch on YouTube
సాగిపోదును - ఆగిపోను నేను విశ్వాసములో నేను - ప్రార్ధనలో నేడు (2) హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2) ఎండిన ఎడారి లోయలలో - నేను నడిచినను కొండ గుహలలో - బీడులలో నేను తిరిగినను (2) నా సహాయకుడు - నా కాపరి యేసే (2) హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2) పగలెండ దెబ్బకైనను - రాత్రి వేళ భయముకైనా పగవాని బానములకైనా - నేను భయపడను (2) నాకు ఆశ్రయము - నా ప్రాణము యేసే (2) హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2) పదివేల మంది పైబడినా - పదిలముగానే నుండెదను ప్రభు యేసు సన్నిధానమే - నాకు ఆధారం (2) నాకు కేడెము - నా కోటయు యేసే (2) హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ (2)