Worship
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
Randi Randi Yesuni Yoddaku Rammanuchunnaadu
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
ప్రయాసపడి భారము మోయువారలు
ప్రభుని చెంతకు పరుగిడి వేగమే
యేసుని పిలుపు వినియు నింక - యోచింపరేల
అవనిలో అగచాట్ల పాలైన
అబ్బదు శాంతి ఆత్మకు నిలలో
||రండి||
కరువు రణము మరణము చూచి - కలుగదు మారుమనస్సు
ప్రవచనములు సంపూర్ణములాయెను
యూదులు తిరిగి వచ్చుచున్నారు
||రండి||
ప్రభు యేసు నీ కొరకై తనదు - ప్రాణము నిచ్చె గదా
సిలువను రక్తము చిందించియును
బలియాయెను యా ఘనుడు మనకై
||రండి||
యేసుని నామమునందె పరమ - నివాసము దొరకును
ముక్తిని పాప విమోచనమును
శక్తిమంతుడు యేసే యిచ్చును
||రండి||
నేనే మార్గము నేనే సత్యము - నేనే జీవమును
నేను గాకింకెవరు లేరని
యెంచి చెప్పిన యేసుని వద్దకు
||రండి||
