Worship

రక్షింపబడిన నీవు లోకాశలపైనే నీదు

Rakshimpabadina Neevu Lokaashalapaine Needu

Watch on YouTube
రక్షింపబడిన నీవు - లోకాశలపైనే నీదు గురి నిలిపి పయనిస్తున్నావా రక్షకుని ఎరిగిన నీవు - తానెవరో తెలియదు నాకు అన్నట్టు జీవిస్తున్నావా (2) యేసే లేని నీ బ్రతుకులో వెలుగే లేదని తెలుసుకో యేసే లేని జీవితానికి విలువే లేదని తెలుసుకో (2) ||రక్షింపబడిన|| మంటితోనే నిను చేసినా కంటి పాపగా కాపాడెనే మాటి మాటికి పడిపోయినా శాశ్వత ప్రేమతో ప్రేమించెనే (2) ఆ ప్రేమను కాదని - అవసరమే లేదని ఈ లోకం నాదని - ప్రభు మార్గం విడచితివా యేసే లేనిదే - పరలోకానికి ప్రవేశం లేదనే - పరమార్ధం మరచితివా ||యేసే|| యేసులోనే నీ రక్షణ యేసులోనే నిరీక్షణ యేసులోనే క్షమాపణ చేసుకో మరి ప్రక్షాళన (2) ఎంతో ప్రేమను - నీపై చూపించెను తన ప్రాణము సహితము - నీకై అర్పించెనుగా ఇప్పటికైననూ - మార్చుకో మనస్సునూ ప్రభువును చేరగా - వేగిరమే పరుగిడిరా ||యేసే||