Easter

రాతి సమాధిలో పాతిన మన యేసు

Raathi Samaadhilo Paathina Mana Yesu

Watch on YouTube
రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై (2) దేవాలయము మూడు దినముల లోపల (2) పడద్రోసి నిలబెట్టె ప్రభు యేసుడు (2) ఆ బండ నెవరు దొర్లించకుండనే తెరువంగ బడి యుండె జై జై జై (2) ||రాతి|| వేకువ జామున చీకటి యుండగ (2) ఏతెంచిరా కాంతలు ఆ చోటకు (2) ఘుమ ఘుమలాడు సుగంధాలు కొని రాగా ముందే లేచియుండె జై జై జై (2) ||రాతి|| ఆ మింట నున్న నా తండ్రి కడకు (2) నేనిపుడేగెద నన్నంటకు (2) తొలిసారి మరియకు కనిపించి పలికెను ఉల్లాసమాయెను జై జై జై (2) ||రాతి||