Christmas

రాజులకే రారాజు పుట్టాడోయ్

Raajulake Raaraaju Puttaadoy

Watch on YouTube
రాజులకే రారాజు పుట్టాడోయ్ దివి నుంచి భువికే వచ్చాడోయ్ ఊరూ వాడా కలిసి రారండోయ్ సంబరాలు సంబరాలు చేయండోయ్... అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని పాటలు పాడి ఆరాధింప ఊరూ వాడా రండి రండి (2) పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని (2) ఆర్భాటించి చాటించి మోగించేద్దామా సంబరాలు సంబరాలు చేసేద్దామా - (4) పుట్టుకతోనే రాజై పుట్టిన రాజులకు రారాజు యేసయ్యని సృష్టిని శాసించే సృష్టికర్త ఏకైక దేవుడు యేసయ్యని (2) జన్మ పాపమే లేనివాడని నీదు భారము మోయువాడని (2) ||ఆర్భాటించి|| వ్యాధి అయినను బాధలైనను విడిపించే దేవుడు యేసయ్యని కష్టమైన నష్టమైన నడిపించే దేవుడు యేసయ్యని (2) మార్గం సత్యము జీవం యేసని మోక్ష ద్వారమై పుట్టినాడని (2) ||ఆర్భాటించి|| సంబరాలు సంబరాలు చేసేద్దామా (5) క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా