Devotional

పువ్వు విరిసి రాలినా

Puvvu Virisi Raalinaa

Watch on YouTube
పువ్వు విరిసి రాలినా పరిమళంబు మిగులును (2) జీవ నీవే తెలుసుకో నీ జీవితం ఏపాటిదో ||పువ్వు|| ధరలో కలిమి లేములు దరి చేరగానే కరగిపోవును (2) దూరపర్చుమా లౌకికం చేరు యేసును శీఘ్రమే ||పువ్వు|| పుడమిలో ఫలియించుమా ఫలమిచ్చు ద్రాక్షా వల్లిలా (2) నేల రాలిన పువ్వులా తేలిపోకుమా గాలిలోన ||పువ్వు|| భువిలో బ్రతుకుట కన్నను భగవంత సన్నిధి పెన్నిధి (2) భారమనక పిలువవే కోరుకో నువ్వు క్రైస్తవా ||పువ్వు||