Worship

ప్రియతమ బంధమా నా హృదయపు ఆశ్రయ దుర్గమా

Priyathama Bandhamaa Naa Hrudhayapu Aashraya Durgamaa

Watch on YouTube
ప్రియతమ బంధమా - నా హృదయపు ఆశ్రయ దుర్గమా అనుదినం అనుక్షణం - నీ ఒడిలో జీవితం ధన్యము కృతజ్ఞతతో పాడెదను నిరంతరము స్తుతించెదను ||ప్రియతమ|| అంధకారపు సమయములోన - నీతి సూర్యుడై ఉదయించావు గమ్యమెరుగని పయనములోన - సత్య సంధుడై నడిపించావు (2) నా నిరీక్షణ ఆధారం నీవు నమ్మదగిన దేవుడవు నీవు (2) కరుణ చూపి రక్షించినావు కరుణామూర్తి యేసు నాథా (2) వందనం వందనం దేవా - వందనం వందనం అనుదినం అనుక్షణం నీకే నా - వందనం వందనం ||కృతజ్ఞతతో|| పరమ తండ్రివి నీవేనని - పూర్ణ మనసుతో ప్రణుతించెదను పరిశుద్ధుడవు నీవేనని - ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను (2) విశ్వసించిన వారందరికి నిత్య జీవము నొసగె దేవా (2) కరుణ చూపి రక్షించినావు కరుణామూర్తి యేసు నాథా (2) వందనం వందనం దేవా - వందనం వందనం అనుదినం అనుక్షణం నీకే నా - వందనం వందనం ||కృతజ్ఞతతో||