Worship

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా

Premisthaa Ninne Naa Yesayyaa

Watch on YouTube
ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా (2) చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయా (2) ||ప్రేమిస్తా|| నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ సిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ (2) ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా|| కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమ కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ (2) ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా|| నా స్థితి మార్చి నను రక్షించెను నీ ప్రేమ నను దీవించి హెచ్చించినది నీ ప్రేమ (2) ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా||