ప్రేమింతును నిన్నే - జీవింతును నీకై
ధ్యానింతును నిన్నే - ప్రకటింతును నీకై
యేసూ… నీవే…
అతి సుందరుడా - అతి శ్రేష్టుడా
నీవే… అతి కాంక్షనీయుడా
నా ప్రాణ ప్రియుడా - నా యేసయ్యా
||ప్రేమింతును||
నీతోనే నేనెల్లప్పుడు జీవింతును యేసయ్యా
ప్రతి దినము నీ రాకడకై నేనెదురు చూచెదనయ్యా (2)
నీ రెక్కల నీడలో నన్ను కాపాడావు
నా జీవిత కాలమంతా నిన్నే కీర్తింతునయ్యా (2)
||యేసూ||
నీ ముఖము అతి మనోహరం సూర్య కాంతి మించినది
నీ స్వరము అతి మధురం తేనె కంటె తీయనిది (2)
షాలేము రాజా సమాధాన కర్తా
రక్షణ పాత్ర చేత బూని ఆరాధింతునయ్యా (2)
||యేసూ||
