Worship

ప్రభువా నీ పరిపూర్ణత నుండి

Prabhuvaa Nee Paripoornatha Nundi

Watch on YouTube
ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను ప్రభువైన యేసు క్రీస్తు - పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును - ప్రసాదించితివి మాకు ||ప్రభువా|| జనకా నీ-వెన్నుకొనిన - జనుల క్షేమము జూచి సంతోషించునట్లు - నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| నీదు స్వాస్థ్యమైనట్టి - నీ ప్రజలతో కలిసి కొనియాడునట్లుగా - నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| దేవా నీదు స్వరూప - దివ్య దర్శనమును దినదినము నాకొసగి - నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| మీ మధ్యన నా ఆత్మ - ఉన్నది భయపడకు డనిన మహోన్నతుడా - నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| ముదమారా నన్నెన్నుకొని - ముద్ర యుంగరముగను చేతుననిన ప్రభువా - నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| కృపా సత్య సమ్మిళిత - సంపూర్ణ స్వరూప హల్లెలూయా నీకే ప్రభో - ఎల్లప్పుడూ కలుగుగాక ||ప్రభువా||