Thanksgiving

ప్రభువా కాచితివి ఇంత కాలం

Prabhuvaa Kaachithivi Intha Kaalam

Watch on YouTube
ప్రభువా… కాచితివి ఇంత కాలం కాచితివి ఇంత కాలం చావైన బ్రతుకైన నీ కొరకే దేవా (2) నీ సాక్షిగా నే జీవింతునయ్యా ||ప్రభువా|| కోరి వలచావు నా బ్రతుకు మలిచావయ్యా మరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా (2) నన్ను వలచావులే - మరి పిలిచావులే (2) అరచేతులలో నను చెక్కు కున్నావులే (2) ||ప్రభువా|| నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా ఇలలో మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా (2) పాపము కడిగావులే - విషము విరచావులే (2) నను మనిషిగా ఇలలోన నిలిపావులే (2) ||ప్రభువా|| బాధలను బాపితివి నీవేనయ్యా నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా (2) నన్ను దీవించితివి - నన్ను పోషించితివి (2) నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే (2) ||ప్రభువా||