Easter

ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను

Prabhuke Sthothramu Mruthini Gelchenu

Watch on YouTube
ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను ప్రభు యేసు యెల్ల వేళ విజయ మిచ్చును ఘన విజయమిచ్చును (2) ఓ సమాధి విజయమేది మరణమా ముల్లెక్కడ మ్రింగె జయము మరణమున్ ఫలించె సత్యవాక్యము (2) జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు|| దైవజన్మ మొందువారె లోకమున్ జయింతురు లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము (2) జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు|| శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్ క్రీస్తు ప్రేమనుండి మనల నేదియు నెడబాపదు (2) జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు|| అన్నిటిలో పొందెదము ఆయనతో విజయము అధిక విజయ మొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారనే (2) జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు|| జయము పొందువారెల్లరు తన రాజ్యవారసుల్ దేవుడే వారికి తండ్రి వారయన పుత్రులు (2) జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు||