యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించి
తిరిగి జన్మిస్తే
ఆయన కొరకు జీవించగలం
ఆయనను మనలో చూపించగలం
పరమ దైవమే మనుష్య రూపమై
ఉదయించెను నా కోసమే
అమర జీవమే నరుల కోసమై
దిగి వచ్చెను ఈ లోకమే
క్రీస్తు పుట్టెను - హల్లెలూయ
క్రీస్తు పుట్టెను - హల్లెలూయ
క్రీస్తు పుట్టెను - హల్లెలూయా (2)
||పరమ దైవమే||
ఆకార రహితుడు ఆత్మ స్వరూపుడు
శరీరమును ధరించెను
సర్వాధికారుడు బలాఢ్య ధీరుడు
దీనత్వమును వరించెను
వైభవమును విడిచెను - దాసునిగను మారెను - (2)
దీవెన భువికి తెచ్చెను - ముక్తి బాటగా…
||పరమ దైవమే||
అనాది వాక్యమే కృపా సమేతమై
ధరపై కాలు మోపెను
ఆ నీతి తేజమే నరావతారమై
శిశువై జననమాయెను
పాపి జతను కోరెను - రిక్తుడు తానాయెను (2)
భూలోకమును చేరెను - యేసు రాజుగా…
||పరమ దైవమే||
నిత్యుడు తండ్రియే విమోచనార్ధమై
కుమారుడై జనించెను
సత్య స్వరూపియే రక్షణ ధ్యేయమై
రాజ్యమునే భరించెను
మధ్య గోడ కూల్చను - సంధిని సమకూర్చను - (2)
సఖ్యత నిలుప వచ్చెను - శాంతి దూతగా…
||పరమ దైవమే||
