Worship

పాపానికి నాకు ఏ సంబంధము లేదు

Paapaaniki Naaku Ye Sambandhamu Ledhu

Watch on YouTube
పాపానికి నాకు ఏ సంబంధము లేదు పాపానికి నాపై ఏ అధికారము లేదు పాపానికి నాకు ఏ సంబంధము లేదు పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాట ఇచ్చాడుగా నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింద నే లేను నే లేను ధర్మ శాస్త్రం క్రింద (2) ||పాపానికి|| కృప ఉందని పాపం చేయొచ్చా - అట్లనరాదు కృప ఉందని నీతిని విడువొచ్చా - అట్లనరాదు కృప అంటే లైసెన్స్ కాదు కృప అంటే ఫ్రీ పాస్ కాదు - పాపాన్ని చేసేందుకు కృప అంటే దేవుని శక్తి కృప అంటే దేవుని నీతి - పాపాన్ని గెలిచేందుకు Grace is not a license to sin It is the power of God to overcome (4) ||నేనున్నా|| కృప ద్వారా ధర్మ శాస్త్రముకు - మృతుడను అయ్యా కృప వలన క్రీస్తులో స్వాతంత్య్రం - నే పొందితినయ్యా క్రియల మూలముగా కాదు కృపయే నను రక్షించినది - నా భారం తొలగించినది నీతి సద్భక్తుల తోడ - బ్రతుకమని బోధించినది Grace took away burden from me And taught me to live righteously (4) ||నేనున్నా|| పాపానికి మృతుడను నేనయ్యా - హల్లెలూయా కృప వలెనె ఇది నాకు సాధ్యం కృపను రుచి చూచిన నేను దేవునికే లోబడుతాను - పాపానికి చోటివ్వను పరిశుద్ధత పొందిన నేను నీతి సాధనములుగానే - దేహం ప్రభుకర్పింతును Yield your bodies unto the Lord As instruments of righteousness (2) ||నేనున్నా|| ధర్మశాస్త్రం పాపం అయ్యిందా - అట్లనరాదు ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా - అట్లనరాదు ధర్మశాస్త్రం కొంత కాలమేగా క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా - మనలను విడిపించేందుకు Law has led the people to Christ Now grace will make His conquerors (4) ||నేనున్నా||