పాడెద దేవా - నీ కృపలన్
నూతన గీతములన్
స్తోత్రము చెల్లింతున్ - స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2)
భూమి పునాదులు వేయకముందే
యేసులో చేసితివి (2)
ప్రేమ పునాదులు వేసితివి
దీనుని బ్రోచితివి - ఈ దీనుని బ్రోచితివి (2)
||పాడెద||
ప్రవిమల రక్తము కలువరి సిలువలో
కలునకు నిచ్చితివి (2)
ప్రేమ కృపా మహదైశ్వర్యములతో
పాపము తుడిచితివి - నా పాపము తుడిచితివి (2)
||పాడెద||
పాపము శాపము నరకపు వేదన
మరి తొలగించితివి (2)
అపరాధములచే చచ్చిన నన్ను
ధర బ్రతికించితివి - నన్ను బ్రతికించితివి (2)
||పాడెద||
దేవుని రాజ్యపు వారసుడనుగా
క్రీస్తులో చేసితివి (2)
చీకటి రాజ్యపు శక్తుల నుండి
నను విడిపించితివి - చెర నను విడిపించితివి (2)
||పాడెద||
ముద్రించితివి శుద్ధాత్మతో నను
భద్రము చేసితివి (2)
సత్యస్వరూప నిత్యనివాసి
సొత్తుగా చేసితివి - నీ సొత్తుగా చేసితివి (2)
||పాడెద||
అన్యుడనై నిను ఎరుగక యున్నను
ధన్యుని చేసితివి (2)
ప్రియ పట్టణ పౌరుల సేవింపను
వరముల నొసగితివి - కృప వరముల నొసగితివి (2)
||పాడెద||
