ఓరన్న ఓరన్న
యేసుకు సాటి వేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా
||ఓరన్న||
చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా (2)
అద్వితీయుడు ఆదిదేవుడు
ఆదరించును ఆదుకొనును (2)
||ఓరన్న||
పరమును విడచి వచ్చాడన్నా వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా (2)
పరిశుద్దుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెను (2)
||ఓరన్న||
సిలువలో ప్రాణం పెట్టాడన్నా పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్న లేచాడన్న (2)
మహిమ ప్రభూ మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును (2)
||ఓరన్న||
