Praise

ఒకే ఒక మార్గము ఒకే ఆధారము

Oke Oka Maargamu Oke Aadhaaramu

Watch on YouTube
ఒకే ఒక మార్గము ఒకే ఆధారము ఒకే పరిహారము లేదు వేరే మార్గం క్రీస్తేసే మార్గం (2) విడువుము నీ మార్గం ||ఒకే ఒక|| లోకం మాయరా పాపం వీడరా (2) నీ హృదయమెంతో బలహీనమంతా పెడ దారి చూపురా (2) పరికించి చూడుమా ||ఒకే ఒక|| రక్తం చిందెరా సిలువలో చూడరా (2) నీ పాపములకు ప్రభు యేసు రక్తం పరిహారమాయెరా (2) క్షమ భిక్ష వేడరా ||ఒకే ఒక|| సమయం లేదురా సత్యమే సోదరా (2) రారాజు త్వరలో రాబోవుచుండె రక్షణను కోరుమా (2) రయముగను చేరుమా ||ఒకే ఒక||