Worship
ఓ సంఘమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా
O Sanghamaa Sarvaangamaa Paraloka Raajyapu Prathibimbamaa
ఓ సంఘమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా
యేసయ్యను ఎదుర్కొనగ నీతి నలంకరించి సిద్ధపడుమా
ఓ సంఘమా వినుమా
రాణి ఓఫిరు అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో
వీణ వాయిద్య తరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో
ఆనంద తైల సుగంధాభిషేకము (2)
పొందితినే యేసునందు (2)
||ఓ సంఘమా||
క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణ మర్పించెనని
స్వస్థపరచె నిర్దోషముగా ముడత కళంకము లేనిదిగ
మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు (2)
సహియింతువా తీర్పునాడు (2)
||ఓ సంఘమా||
చీకటిలో నుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు
శ్రీకర గుణాతిశయములను ప్రకటించుటకే పిలిచెనని
గుర్తించుచుంటివా క్రియలను గంటివా (2)
సజీవముగా నున్నావా (2)
||ఓ సంఘమా||
చల్లగనైన వెచ్చగను ఉండిన నీకది మేలగును
నులివెచ్చని స్థితి నీకుండిన బయటకు ఉమ్మి వేయబడుదువేమో
నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో (2)
ఆసక్తితో రక్షణ పొందుమా (2)
||ఓ సంఘమా||
