Worship

ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి

O Prabhuvaa Neeve Naa Manchi Kaaparivi

Watch on YouTube
ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక (2) అంతము వరకు కాపాడు దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2) నన్ను నీవు మరువని దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||