Evangelism

ఓ మానవా నిజమేదో ఎరుగవా

O Maanavaa Nijamedo Erugavaa

Watch on YouTube
ఓ మానవా నిజమేదో ఎరుగవా ఓ మానవా ఇకనైనా మారవా మన పాపములను క్షమియించుటకే సిలువ మరణము పొందెనని (2) గ్రహియించి నేడు ఆ యేసు ప్రభుని వేడు (2) ఈ దినమే అనుకూలం లేదిక వేరే ఏ సమయం (2) నిజమేదో తెలియకనే చనిపోతే నీ గతి ఏమి? (2) ||ఓ మానవా|| సిలువను గూర్చిన శుభ వార్త వెర్రితనముగా ఉన్నదా? దేవుని శక్తని తెలుసుకొని ప్రభు మార్గమును చేరెదవా (2) ||ఈ దినమే|| ప్రయాసముతో భారము మోసే నిన్నే దేవుడు పిలిచెనుగా ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద వేగిరమే పరుగిడి రావా (2) ||ఈ దినమే|| నీ ధనము నీ ఘనము నీ సర్వస్వము చితి వరకే అర్పించుము నీ హృదయమును నిజ రక్షకుడైన ప్రభు కొరకే (2) ||ఈ దినమే||