Prayer

ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా

O Devaa Daya Choopumayyaa Desaanni Baaguchayumayyaa

Watch on YouTube
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా నీ ప్రజల మొరను అలకించుమా నీ కృపలో మమ్మును నడిపించుమా మన్నించి బ్రతికించు ఉజ్జీవం రగిలించు ||ఓ దేవా|| సర్వలోక రక్షకా కరుణించుమయ్యా నీ వాక్య శక్తిని కనుపరచుమయ్యా అంధకార ప్రజలను వెలిగించుమయ్యా పునరుత్ధాన శక్తితో విడిపించుమయ్యా ఒకసారి చూడు ఈ పాప లోకం నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు దేశాన్ని క్షమియించు ప్రేమతో రక్షించు ||ఓ దేవా||