Evangelism

న్యాయాధిపతియైన దేవుడు

Nyaayaadhipathiyaina Devudu

Watch on YouTube
న్యాయాధిపతియైన దేవుడు - నిన్ను పిలిచే వేళలోన ఏ గుంపులో ఉంటావో తెలుసుకో - మరలా వచ్చే వేళలోన (2) ||న్యాయాధిపతి|| ఒక గుంపేమో పరలోకపు గుంపు రక్షింపబడిన వారికే అది సొంతం మరు గుంపేమో ఘోర నరకపు గుంపు నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం ||న్యాయాధిపతి|| నీవు కాదు నీ క్రియలు కాదు - ఆ పరముకు నిను చేర్చేది కాదు కాదు వేరెవరో కాదు - మరణమును తప్పించేది (2) కలువరిలో తన ప్రాణం పెట్టిన యేసయ్యే నీ ప్రాణ రక్షణ సిలువలో క్రయ ధనమే చెల్లించిన ఆ ప్రభువే నీ పాప విమోచన ||ఒక గుంపేమో|| ఇదియే సమయం ఇక లేదే తరుణం - నీ పాపము ఒప్పుకొనుటకు ఆ పరలోకం చేరే మార్గం - యేసేగా ప్రతి ఒక్కరకు (2) మేఘముపై రానైయున్నాడుగా త్వరలోనే నిను కొనిపోడానికి వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా నీ హృదిలో స్వీకరించడానికి ||ఒక గుంపేమో||