Faith

నిను మాత్రమే నే నమ్మానయా

Ninu Maathrame Ne Nammaanayaa

Watch on YouTube
నిను మాత్రమే నే నమ్మానయా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా (2) నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటిని సరిచేయును (2) కృప చూపువాడవయా నీ పిల్లలకు (2) నీవు సెలవియ్యగా కలుగనిదేముంది వాక్కును పంపగా జరుగనిదేముంది (2) సకలము నీదెనయా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయా (2) సమకూర్చువాడవయా నీ పిల్లలకు (2) నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడువాడెవడు (2) యుద్ధము నీదెనయా ఓ శూరుడా ముందుకు సాగెదనయా (2) జయమిచ్చువాడవయా నీ పిల్లలకు (2) నీవు కరుణించగా కాదనువాడెవడు శక్తితో నింపగా ఓడించువాడెవడు (2) సాయము నీదెనయా సహాయకుడా నీలో దాగెదనయా (2) బలమిచ్చువాడవయా నీ పిల్లలకు (2)