Dedication

నిను గాక మరి దేనిని - నే ప్రేమింపనీయకు

Ninu Gaaka Mari Denini - Ne Premimpaneeyaku

Watch on YouTube
నిను గాక మరి దేనిని - నే ప్రేమింపనీయకు (2) నీ కృపలో నీ దయలో - నీ మహిమ సన్నిధిలో నను నిలుపుమో యేసు ||నిను గాక|| నా తలపులకు అందనిది - నీ సిలువ ప్రేమా నీ అరచేతిలో నా జీవితం - చెక్కించుకొంటివే వివరింప తరమా నీ కార్యముల్ ఇహ పరములకు నా ఆధారం - నీవై యుండగా నా యేసువా - నా యేసువా ||నిను గాక|| రంగుల వలయాల ఆకర్షణలో - మురిపించే మెరుపులలో ఆశా నిరాశల కోటలలో ఎదురీదు ఈ లోకంలో చుక్కాని నీవే నా దరి నీవే నా గమ్యము నీ రాజ్యమే - నీ రాజ్యమే నా యేసువా - నా యేసువా ||నిను గాక||