Faith

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును

Nenu Velle Maargamu - Naa Yesuke Theliyunu

Watch on YouTube
నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను (2) ||నేను|| కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున (2) గురిలేని తరుణాన వెరువగ - నా దరినే నిలిచేవ నా ప్రభు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2) జలములలోబడి నే వెళ్లినా - అవి నా మీద పారవు (2) అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2) విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు (2) సాతాను సుడిగాలి రేపగా - నా యెదుటే నిలిచేవా నా ప్రభు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2) ||నేను||