నేను తగ్గాలి యేసు - నీవే హెచ్చాలి (2)
నేను పూర్తిగా మరుగై - నీవే కనబడాలి (2)
ఇదియే నా ప్రార్థన - నీ చిత్తము (2)
||నేను||
నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి (2)
నా స్వార్ధ్య జీవితమంతా లయమైపోవాలి (2)
యేసూ నీ స్వభావము నాలో అధికమౌతు ఉండాలి (2)
పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి (2)
||ఇదియే||
ఆదాము పాపము నాలో వసియించియుండగా (2)
యేసూ నీ రక్తమే దాని నశియింప చేయును (2)
ఆటంకమేమియు లేక జీవధారలుండాలి (2)
యేసూ నీ జీవము నాలో నింపబడుతు పోవాలి (2)
||ఇదియే||
