నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే
అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2)
స్తుతియించుట మానను
కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
||అంతా||
ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా
ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2)
యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2)
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2)
||అంతా||
అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2)
నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2)
నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2)
||అంతా||
ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2)
నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2)
పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2)
||అంతా||
చదువులే రాకున్నా - ఓటమి పాలైనా
ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా (2)
నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2)
నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు (2)
||అంతా||
సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2)
యేసుని సారూప్యము - నేను పొందాలని (2)
అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2)
||అంతా||
నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను - తెలిసికొందును (2)
ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2)
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2)
||అంతా||
