Encouragement
నీవు తోడైయుండగా యేసు - భయము లేదు ఇలలో
Neevu Thodaiyundagaa Yesu - Bhayamu Ledhu Ilalo
నీవు తోడైయుండగా యేసు - భయము లేదు ఇలలో
మేలు చేయు దేవుడా నీకు - సాటి లేరు సృష్టిలో
ఎక్కలేని కొండలెన్నో ఎదురొచ్చిననూ
లెక్కలేని నిందలే నన్ను బాధించిననూ
||నీవు తోడైయుండగా||
గతం గాయాన్ని చేయగా - గాయం హృదయాన్ని చీల్చగా
శోకం సంద్రంలా ముంచగా - లోకం బంధాలే తెంచగా
పేరు పెట్టి తల్లిలా పిలచి లాలించితివి
నీవే తోడు నీడగా నిలచి కృప చూపితివి
||నీవు తోడైయుండగా||
ఆశ నిరాశగా మారినా - నిరాశ నిస్పృహ పెంచినా
యుక్తి తెలియక తిరిగినా - శక్తి క్షీణించిపోయినా
వెన్ను తట్టి తండ్రిలా నిలిపి నడిపించితివి
నీవే కొండ కోటగా నిలిచి బలపరచితివి
||నీవు తోడైయుండగా||
నీవు నాకు అండగా నిలచి - దారి చూపినావయ్యా
నేను నీకు మెండుగా స్తుతులు - అర్పించెదను
