Encouragement

నీవు లేని క్షణమైనా ఊహించలేను

Neevu Leni Kshanamainaa Oohinchalenu

Watch on YouTube
నీవు లేని క్షణమైనా ఊహించలేను నీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2) నీవే నా కాపరి - నీవే నా ఊపిరి నీవే నా సర్వము యేసయ్య నీతోనే జీవితం - నేనే నీకంకితం గైకొనుమో నన్ను ఓ దేవా… ||నీవు లేని|| శ్రమలెన్నో వచ్చినా - శోధనలే బిగిసినా నను ధైర్యపరిచె నీ వాక్యం సంద్రాలే పొంగినా - అలలే ఎగసినా నను మునగనీయక లేవనెత్తిన (2) నీవే నా కండగా - నాతో నీవుండగా భయమన్నదే నాకు లేదూ సర్వలోక నాధుడా - కాపాడే దేవుడా వందనము నీకే ఓ దేవా… ||నీవు లేని|| శత్రువులే లేచినా - అగ్ని ఆవరించినా అవి నన్ను కాల్చజాలవుగా దుష్టులే వచ్చినా - సింహాలై గర్జించినా నాకేమాత్రం హాని చేయవుగా (2) వెన్నుతట్టి బలపరచిన - చేయిపట్టి నడిపించిన వేదనలే తొలగించిన యేసయ్యా సర్వలోక నాధుడా - కాపాడే దేవుడా వందనము నీకే ఓ దేవా… ||నీవు లేని||