నీవే నా రక్షణ - నీవే నిరీక్షణ
నీవే నా దీవెన - నీవే క్షమాపణ (2)
యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా
యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా (2)
||నీవే నా||
గతమును మన్నించి గుణవంతునిగా చేసి
నన్ను మలచి నన్నే మరిపించి (2)
మనిషిగా మార్చినావు
నీ మనసు నాకిచ్చినావు (2)
||యేసయ్యా||
కన్నీరు తుడచి కష్టాలు తీర్చి
అండగ నిలిచి అడ్డులన్ని తొలగించి (2)
మనిషిగా మార్చినావు
మాదిరిగ చేసినావు (2)
||యేసయ్యా||
