నీవే ఆశ నీవే శ్వాస
నీవే ధ్యాస యేసువా
నీవే ప్రాణం నీవే గానం
నీవే ధ్యానం నేస్తమా
తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను (2)
నీ రూపులోనే నీ చేతి పనిగా - నను నీవు మలచితివే
నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై - నను సృజియించితివే
||నీవే||
ఇహమున నా కొసగిన - ఈ ధర ఎంత భాగ్యమని
తలచితి నే భ్రమచితి - అంతయు నాకు సొంతమని
ఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికై
ప్రతి హృదయం స్వార్ధమాయే
ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన
ఒక ప్రేమైన కాన రాదే
||నీవే||
హృదయము పులకించెను - నీ ప్రేమ ప్రచించగానే
దృఢమాయె నా మదిలో - ఇక అంతయు వ్యర్థమని
నా జీవన గమనాన్ని నీ వైపు మలచి
నీ అడుగులలో నే నడచి
నీ ప్రియమైన ప్రేమగా ఇలలో జీవించి
నీ కౌగిలిలో ఒదుగుదునే
||నీవే||
