నీతిగల యెహోవా స్తుతి మీ - ఆత్మతో నర్పించుడి
మీ ఆత్మతో నర్పించుడి - దాతయవు మన క్రీస్తు నీతిని
దాల్చుకొని సేవించుడి
||నీతి||
చదల బుడమియు రవియు జలధియు - నదులు గిరులును జక్కగా
సదమలంబగు దైవ నామము - సర్వదా నుతి జేయును
||నీతి||
సర్వశక్తుని కార్యముల కీ - సర్వ రాష్ట్రము లన్నియు
గర్వములు విడి తలలు వంచుచు - నుర్విలో నుతిజేయను
||నీతి||
గీత తాండవ వాద్యములచే - బ్రీతి పరచెడు సేవతో
పాతకంబులు పరిహరించెడు - దాతనే సేవించుడి
||నీతి||
పరమ దూతలు నరులు పుడమిని - మొరలుబెట్టుచు దేవుని
పరము నందున్నట్టి యేసుని - పాదములు సేవింతురు
||నీతి||
ఇలను భక్తులు గూడుకొనియా - బలము గల్గిన దేవుని
వెలయు స్తుతి వే నోళ్ళతోడను - విసుగు జెందక జేయుడి
||నీతి||
ఆత్మ నీవిక మేలుకొని శు - ధ్ధాత్మ యేసుని దండ్రిని
త్రిత్వమగునా యేక దేవుని - హర్షమున సేవింపవే
||నీతి||
