Thanksgiving

నీదు ప్రేమ నాలో ఉంచి జీవమునిచ్చావు

Needu Prema Naalo Unchi Jeevamunichchaavu

Watch on YouTube
నీదు ప్రేమ నాలో ఉంచి జీవమునిచ్చావు నీదు రూపమే నాలో ఉంచి నన్ను చేసావు మంటివాడను నన్ను నీవు మహిమపరిచావు మరణపాత్రుడనైన నన్ను పరము చేర్చావు ఎంత ప్రేమ యేసయ్యా - నీకెంత నాపై కరుణయో మరువగలనా నీ కృప - బ్రతుకంతయు (2) తోడువైనావు నా నీడవైనావు నీవు నాకు ఉండగా నాకు ఈ దిగులెందుకు మంచి కాపరి నీవేనయ్యా నా యేసయ్యా ఎంచలేనయ్యా నీ వాత్సల్యం ఓ మెస్సయ్యా జీవితమంతా మరువలేనయ్యా ||నీదు ప్రేమ|| ప్రాణమైనావు నీవే ధ్యానమైనావు అన్నీ నీవై చేరదీసి ఆశ్రయమైనావు నీతిసూర్యుడా పరిపూర్ణుడా నిత్య దేవుడా కీర్తనీయుడా కృపాపూర్ణుడా సత్యజీవుడా నేను నిన్ను విడువలేనయ్యా ||నీదు ప్రేమ||