Prayer

నీ స్వరము వినిపించు ప్రభువా

Nee Swaramu Vinipinchu Prabhuvaa

Watch on YouTube
నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ (2) నీ వాక్యమును నేర్పించు దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము|| ఉదయమునే లేచి - నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు - నను సిద్ధపరచు రక్షించు ఆపదలనుండి - (2) ||నీ స్వరము|| నీ వాక్యము చదివి - నీ స్వరము వినుచు నేను సరి చేసికొందు నీ మార్గములో - నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ - (2) ||నీ స్వరము|| భయ భీతులలో - తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము - ఓ గొప్ప దేవా ధైర్య పరచుము నన్ను - (2) ||నీ స్వరము|| నాతో మాట్లాడు - స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే నీతో మనుష్యులతో - సరిచేసికొందు నీ దివ్య వాక్యము ద్వారా - (2) ||నీ స్వరము|| నేర్చుకున్నాను - నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా - నీ విశ్వాస్యతలో నీ యందు నిలచునట్లు - (2) ||నీ స్వరము|| నా హృదయములోని - చెడు తలంపులను చేధించు నీ వాక్యము నీ రూపమునకు - మార్చుము నన్ను నీదు మహిమ కొరకేగా - (2) ||నీ స్వరము||