నీ సిలువే నా శరణము (2)
విలువైన రుధిరాన్ని కార్చి
వెలపోసి నన్ను కొన్నావు (2)
ప్రేమా త్యాగం నీవే యేసయ్యా
మహిమా నీకే ఆరోపింతును
గాయాలు పొందినావు - వెలివేయబడినావు
నా శిక్ష నీవు పొంది - రక్షణను కనుపరచావు (2)
నీ ప్రేమ ఇంత అంతని - నే తెలుపలేను
నీ కృపను చాటెదన్ - నా జీవితాంతము
నేరము చేయని నీవు - ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ - మోయలేక మోసావు
కొరడాలు చెళ్ళని చీల్చెనే - నీ సుందర దేహమునే (2)
తడిపెను నీ తనువునే రుధిరంబు ధారలే (2)
వెలి అయిన యేసయ్యా - బలి అయిన యేసయ్యా (2)
సిలువలో ఆ సిలువలో - ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)
విలువే లేని నా బ్రతుకును - విలువ పెట్టి కొన్నావయ్యా (2)
నాదు పాపమంతయూ (2)
నీదు భుజముపై మోసావయ్యా (2)
గొల్గొతా కొండ పైన (2)
గాయాలు పొందితివే (3)
చెమటయు రక్తముగా - ఆత్మల వేదనయూ (2)
పొందెను యేసు నీ కొరకే
తండ్రీ నీ చిత్తం - సిద్ధించు గాక అని పలికెను (2)
కల్వారిలో జీవామిచ్చెన్ (2)
నీ పాపములను తొలగించుటకై
నీదు సిలువన్ మోసెను యేసు (2)
రగిలిందిలే ఒక జ్వాలలా - ప్రభు యేసు హృదయము
కరిగిందిలే ఒక ధారలా - పరమాత్మ రుధిరము
చలించిపోయెనే ఆ సిలువ ధాటికి (2)
కసాయి చేతిలో అల్లాడిపోయెనే (2)
రగిలిందిలే ఒక జ్వాలలా - ప్రభు యేసు హృదయము
కరిగిందిలే ఒక ధారలా - పరమాత్మ రుధిరము
కృపా సత్య దేవా - సిలువలో మాకై బలియై
రక్తము చిందించినావు - రక్షణిచ్చినావు (2)
ఆరాధింతుము నిన్ను యేసు - ఆత్మ సత్యముతో
పాడి కొనియాడి కీర్తింతుము
పూజించి ఘనపరతుము
హాల్లేలూయా హాల్లేలూయా (3)
నిన్నే ఆరాధింతుమ్ (3)
