Evangelism

నీ సాక్ష్యము ఏది

Nee Saakshyamu Edhi

Watch on YouTube
నీ సాక్ష్యము ఏది నీ బలియర్పణ ఏది (2) ప్రభు యేసునంగీకరించి - నిద్రించెదవేల ప్రభు యేసునంగీకరించి - జాగు చేసెదవేళ మేల్కో లెమ్ము (2) రారమ్ము విశ్వాసి ||నీ సాక్ష్యము|| అపోస్తుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో (2) అన్నింటి సహించుచు (2) ఆత్మలాదాయము చేసిరి ||నీ సాక్ష్యము|| కొరడాతో కొట్టబడిరి చెరసాలయందుంచబడిరి (2) చెరసాల సంకెళ్లును (2) వారినాటంక పరచలేదు ||నీ సాక్ష్యము|| కోత విస్తారమెంతో కోత కోయువారు కొందరే (2) యేసు నిన్ పిలచుచుండే (2) త్రోసివేసెదవా ప్రభు పిలుపును ||నీ సాక్ష్యము||