నీ రక్త ధారలే - మా జీవనాధారాము
నీ సిల్వ మార్గమే - మా మోక్ష భాగ్యము
ఓ సిల్వ రాజ - క్రీస్తు రాజ
నీతి రాజ - యేసు రాజ (2)
||ఓ సిల్వ||
మాలోన పలికించు జీవన రాగము - నీ ఆర్తనాదములే
మాలోన వెలిగించు జీవన జ్యోతులు - నీ సిల్వ రూపమే
||ఓ సిల్వ||
మమ్మును నడిపించు పరలోకమునకు - నీ సత్య వాక్యమే
పాపపు చీకట్లు పారద్రోలెను - నీ నీతి ప్రభావమే
||ఓ సిల్వ||
నీ సిలువ మరణము మనుజాళికంత - కలిగించె రక్షణ
నీ మరణ విజయము జగమందు వెలుగొందు - క్రైస్తవ విజయమై
||ఓ సిల్వ||
