Dedication

నీ ప్రియ ప్రభుని సేవకై

Nee Priya Prabhuni Sevakai

Watch on YouTube
నీ ప్రియ ప్రభుని సేవకై - అర్పించుకో నీవే పవిత్ర ప్రజలైన మీరు - సేవించుడాయననే (2) అంధకార జీవితమునకు - వెలుగు తెచ్చెను తానే (2) ఆ వెలుగు ద్వారానే - నూతన మార్గము కలిగె (2) సజీవ బలిగా నర్పించు - నీ జీవితమాయనకే (2) ||నీ ప్రియ|| తప్పిపోతివి గతమందు - తప్పు దారిని నడిచితివి (2) తన ప్రేమా హస్తమే - నిన్ను కాపాడి తెచ్చెను (2) యెంతైన స్మరియించు నీవు - వింతైన తన ప్రేమన్ (2) ||నీ ప్రియ|| ఓ ప్రియుడా తలచితివా - నీ జన్మమే పాపమని (2) ప్రభువే తన రక్తముతో - నీ పాపము క్షమియించె (2) నీ యుల్లము ఆయన కాలయమే - జ్ఞాపకముంచుకొనుము (2) ||నీ ప్రియ|| యెవరతని సేవించెదరో - ఫలమొందెదరంతమందు (2) ఇతరులకు లేనట్టి - ఆ ఘనతను నీ కిచ్చె (2) కృతజ్ఞుడవై కొనియాడు - ప్రభు పాద సన్నిధిని (2) ||నీ ప్రియ||