నీ పాదముల్ నే చేరగా - గాయంబులున్ నే గాంచితిన్
నీ సిలువకై నే చేరగా - నీ ప్రేమను నే పొందితిన్
నా కొరకే ఈ మరణమా - నా పాపమే కారణమా (2)
||నీ పాదముల్||
నా అతిక్రమముల బట్టి గాయపరచబడెగా
నా దోషములను బట్టి నలుగగొట్టబడెగా (2)
సమాధానార్థమైన శిక్ష మీద పడెను
పాపపరిహార్థ బలిగ వధియించబడెను (2)
||నా కొరకే||
వధకు తేబడు గొర్రెపిల్ల నిలచునట్లుగా
మౌనముగా నుండి నీవు తీర్పునొందితివివే (2)
నీ వేదన చూసి హేళన చేసిన గానీ
వీరేమి చేతిరో ఎరుగరంటివే (2)
||నా కొరకే||
