Thanksgiving

నీ కృపను గూర్చి నే పాడెదా

Nee Krupanu Gurchi Ne Paadedaa

Watch on YouTube
నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా (2) నిత్యము నే పాడెదా నా ప్రభుని కొనియాడెదా (2) మహిమా ఘనతా ప్రభావము చెల్లించెదా (2) ||నీ కృపను|| ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా నిందలో అపనిందలో నాకు తోడు నీడగా (2) నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా (2) ||నీ కృపను|| వాక్యమై వాగ్ధానమై నా కొరకై ఉదయించినా మరణమే బలియాగమై నన్ను విడిపించినా (2) నా యేసు నాకుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసా నీకేలా (2) ||నీ కృపను||