Devotional

నీ కృప లేనిచో

Nee Krupa Lenicho

Watch on YouTube
నీ కృప లేనిచో ఒక క్షణమైననూ నే నిలువజాలనో ప్రభు (2) నీ కృప లేనిచో ఒక క్షణమైననూ నే నిలువజాలనో ప్రభు (2) ప్రతి క్షణం కనుపాపలా నను కాయుచున్న దేవుడా (2) ||నీ కృప|| ఈ ఊపిరి నీదేనయ్యా నీవిచ్చిన దానం నాకై నా ఆశ నీవేనయ్యా నా జీవితమంతా నీకై (2) నిను నే మరతునా మరువనో ప్రభు నిను నే విడతునా విడువనో ప్రభు (2) ||నీ కృప|| నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినావు నీ దయ నాపై నీ దయ లేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై (2) కాచి ఉంచినావయ్యా - ఇంత వరకును నను వీడిపోదయ్యా - నాకున్న నీ కృప (2) ||నీ కృప||