Encouragement

నీ జ్ఞాపకం అనేకులను

Nee Jnaapakam Anekulanu

Watch on YouTube
నీ జ్ఞాపకం అనేకులను - ప్రభు వైపుకు త్రిప్పుచుండెనా నీ జ్ఞాపకం ఆత్మీయులకు - క్షేమాభివృద్ధి నిచ్చుచుండెనా (2) నీ జ్ఞాపకం నీవు మరణించినా మరణాంతర పరిచర్య చేయునా (2) మరణాంతర పరిచర్య చేయునా ||నీ జ్ఞాపకం|| పేతురన్న జ్ఞాపకం - పశ్చాత్తాప పరిమళం పౌలన్న జ్ఞాపకం - పోరాటపు ప్రోత్సాహం (2) నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం|| బర్నబాన్న జ్ఞాపకం - ఆదరణానందము తిమోతన్న జ్ఞాపకం - విశ్వాస విజయము (2) నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం|| ఫిలిప్పన్న జ్ఞాపకం - సువార్త సునాదము స్తెఫనన్న జ్ఞాపకం - క్రీస్తుని స్వారూప్యము (2) నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం||