నీ చరణములే నమ్మితి నమ్మితి
నీ పాదములే పట్టితి (2)
||నీ చరణములే||
దిక్కిక నీవే చక్కగ రావే (2)
మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు
||నీ చరణములే||
ఐహిక సుఖము - నరసితి నిత్యము (2)
ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని
||నీ చరణములే||
న్యాయము గాని - నా క్రియలన్ని (2)
రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు
||నీ చరణములే||
భావము మార్చి - నావెత దీర్చి (2)
దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే
||నీ చరణములే||
చంచల బుద్ధి - వంచన యెద్ది (2)
ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే
||నీ చరణములే||
చుర్రుకొని యున్న - శోధనలున్న (2)
పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే
||నీ చరణములే||
నాచు పిశాచి - నరుకుట గాచి (2)
కాచుకో దాచవే దాచవే దాచవే
||నీ చరణములే||
యేసుని తోడ - నెవ్వరు సాటి (2)
దోసము బాపును బాపును బాపును
||నీ చరణములే||
