Evangelism

నశియించెడి లోకంలో

Nashiyinchedi Lokamlo

Watch on YouTube
నశియించెడి లోకంలో - వసియించవు కలకాలం మేలైనది చేపట్టి - సాగించు నీ పయనం - (2) అది నాదంటూ ఇది నాదంటూ - ఆనందం కోల్పోతూ పరమార్ధం గ్రహియించకనే - గతియించిపోతావా ||నశియించెడి|| కాలంతో పాటుగా కృశియించును శరీరం మరణం కబళించును ఏ ఘడియలోనైనా (2) క్రీస్తు దారిలో సాగి - నిత్య రాజ్యమే చేరి (2) వసియించు కలకాలం - సత్యమైన లోకంలో ||నశియించెడి|| నిలచిపోవును మహిలోన బంధాలన్ని మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో (2) ఇకనైనా తేరుకొని - గ్రహియించు సత్యాన్ని (2) యేసులోకి మళ్ళించు - నీ జీవిత గమనాన్ని ||నశియించెడి||