నన్ను చూచువాడా - నిత్యం కాచువాడా (2)
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టూ నన్ను ఆవరించావు (2)
కూర్చుండుట... నే లేచియుండుట (2)
(రాజా) బాగుగ ఎరిగియున్నావు (2)
||నన్ను చూచువాడా||
తలంపులు తపనయు అన్ని
అన్నియు ఎరిగియున్నావు (2)
నడచిననూ పడుకున్ననూ
అయ్యా! నీవెరిగియున్నావు (2)
ధన్యవాదం యేసు రాజా (2)
||నన్ను చూచువాడా||
వెనుకను ముందును కప్పి
చుట్టూ నన్ను ఆవరించావు (2)
(నీ) చేతులచే అనుదినము
పట్టి నీవే నడిపించావు (2)
ధన్యవాదం యేసు రాజా (2)
||నన్ను చూచువాడా||
పిండమునై యుండగా నీ కన్నులకు
మరుగై నేనుండలేదయ్యా (2)
విచిత్రముగా నిర్మించితివి
ఆశ్చర్యమే కలుగుచున్నది (2)
ధన్యవాదం యేసు రాజా (2)
||నన్ను చూచువాడా||
