నన్నెంతగానో ప్రేమించెను - నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము - నా శాపము
తొలగించెను నను కరుణించెను (2)
||నన్నెంత||
సాతాను బంధాలలో - జీవంపు డంబాలలో (2)
పడనీయక దరి చేరనీయక (2)
తన కృపలో నిరతంబు నను నిల్పెను (2)
||నన్నెంత||
సత్యంబు జీవంబును - ఈ బ్రతుకు సాఫల్యము (2)
నేర్పించెను నాకు చూపించెను (2)
వర్ణింపగా లేను ఆ ప్రభువును (2)
||నన్నెంత||
కల్వరి గిరిపైనను - ఆ సిలువ మరణంబును (2)
నా కోసమే యేసు శ్రమ పొందెను (2)
నా పాపమంతటిని క్షమియించెను (2)
||నన్నెంత||
ఘనమైన ఆ ప్రేమకు - వెలలేని త్యాగంబుకు (2)
ఏమిత్తును నేనేమిత్తును (2)
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2)
||నన్నెంత||
